Tuesday, 3 November 2026

వర్షానికి రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ భారీ వృక్షం

తక్షణమే స్పందించి తొలగిస్తున్న స్థానిక సర్పంచ్ మల్లెల రణధీర్

 

జూలై 13 జనంసాక్షి: మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రధాన రహదారి ఓటాయి రోడ్డు బుర్కపల్లి వాగు వద్ద అడ్డంగా విరిగిపడ్డ వృక్షాన్ని కొత్తగూడ సర్పంచి రణధీర్ తక్షణమే స్పందించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జెసిబి యూనియన్ సహాయంతో తొలగించడం జరిగింది.ఈ సహాయక చర్యల్లో పంచాయతీ కార్యదర్శి సుమన్,జవహర్లాల్ నెహ్రు యువజన సంఘం సభ్యులు అమర్ రాజు,జెసిబి ఓనర్ లు శంకర్,రవి లు పాల్గొన్నారు.