Wednesday, 4 November 2026

వర్షాభావంతో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌

పరిస్థితులను సవిూక్షిస్తున్న అధికారులు

నిరంతర విద్యుత్‌ సరఫరాకు భంగం వాటిల్లకుండా చర్యలు

హైదరాబాద్‌,ఆగస్ట్‌ 8(జ‌నం సాక్షి): వర్షాభావం కారణంగా వ్యవసాయానికి కొన్నిచోట్ల 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తున్నా గృహావసరాల డిమాండ్‌ మరింతగా పెరగుతోంది. కొన్నిచోట్ల ఎండలు తీవ్రం కావడంతో విద్యుత్‌ డిమాండ్‌ కూడా పెరుగుతోందని అంటున్నారు. కేవలం వర్షాభావం కారణంగా ఈ పరిస్తితి ఏర్పడిందని అంటున్నారు. వర్షాలు కురవకుంటే మరింత డిమాండ్‌ ఉంటుందని అధికారులు హెచ్చరించడంతో అందుకు తగ్గట్లుగా విద్యుత్‌ సంస్థలు కోతలు లేకుండా కసరత్తు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరవాత సిఎం కెసిఆర్‌ తీసుకున్న చర్యల కారణంగా ఇప్పటి వరకు విద్యుత్‌ సమస్యలు లేకుండా గడిచిపోతోంది. ఇటీవల వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నారు. గృహావసరాలతోపాటు, వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ సరఫరా అవుతోంది. సీఎం కేసీఆర్‌ పట్టుదలతో విద్యుత్‌ లోటు లేకుండా చూస్తున్నారు. అయితే వర్షాభావం కారణంగా మళ్లీ సమస్యలు వచ్చే ప్రమాదం

ఉందని అంటున్నారు. జలవిద్యుత్‌ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. వినియోగం పెరిగినా.. డిమాండ్‌కు సరిపడా విద్యుత్తును టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు నిరంతరం సరఫరా చేస్తున్నారు. వర్షాకాలంలోనూ ఎండాకాలం తలపిస్తున్నా వినియోగం అమాంతం పెరిగిపోయినా డిమాండ్‌కు సరిపడా విద్యుత్తును అధికారులు సరఫరా చేస్తున్నారు. రోజు రోజుకూ ఎండలు పెరగడంతో ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. దీంతో పగటిపూట నిరంతరాయంగా ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను ఆశ్రయించడంతో విద్యుత్తు వినియోగం అధికమైంది. భారీగా పెరిగిన వినియోగం వేసవి వచ్చిందంటే గతంలో విడతల వారీగా విద్యుత్తు సరఫరా చేసేవారు. ఇదిలావుంటే భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్‌లో 1080 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తిని చేయనున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్లాంట్‌ నిర్మాణంలో 4 యూనిట్లలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాయిలర్స్‌, ఈఎస్‌పీ, పవర్‌హౌజ్‌ ఏరియా, టర్బైన్‌ ఫాబ్రిక్‌ కాలమ్‌ తదితర పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. అంతేకాక ఈ నాలుగు యూనిట్లలో సివిల్‌ పనులు ఫౌండేషన్స్‌, కాలమ్స్‌, ఫ్యాభ్రికేషన్‌, కాంక్రీట్‌ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మొదటి యూనిట్‌లో పనులు చకచక జరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు రంగంపై దృష్టి పెట్టి సంస్కరణలు ప్రవేశ పెట్టడంతో ప్రస్తుతం నిరంతరం వెలుగులు అందుతున్నాయి. జిల్లాల్లో గృహావసరాల కోసం పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లో ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు నిరంతరాయంగా 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం అధికం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొనుగోలు చేసి

సరఫరా చేస్తోంది. దీంతో ప్రజలకు విద్యుత్‌ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అయితే జలవిద్యుత్‌ ఉత్పత్తి పడిపోవడం, జలాశయాల్లో నీరు లేకపోవడంతో భవిష్యత్‌లో మరింతగా ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదిలావుంటే పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ కారణంగా జిల్లాల్లో కొత్తగా సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్‌ఆనరు. లో ఓల్టేజీ, విద్యుత్తు కోతలు లేకుండా నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో నూతనంగా మరో ఐదు సబ్‌స్టేషన్లకు ఆమోదించింది. వచ్చే ఏడాది పూర్తవుతాయని విద్యుత్తు శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

—-