వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరికీ గాయాలు

క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించిన మున్సిపల్ చైర్మన్
బాన్సువాడ, జనంసాక్షి (జులై 09):
బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న శివ ఇల్లు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలి ఇద్దరికీ గాయాలవ్వగా స్పందించిన మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ సంఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్ వెంకటేష్, కౌన్సిలర్లు లింగమేశ్వర్, బాడీ శ్రీను,కిరణ్, అమర్, నార్ల ఉదయ్, యూనుస్ కనుకుట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.