ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని పాలకులు,అధికారులు
కొండపాక (జనంసాక్షి) జులై 12 : మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల పరిధిలోని మర్పడగ-రాంపల్లి మట్టి రోడ్డు రోడ్లు పూర్తిగా ధ్వంసమై చిత్తడి చిత్తడిగా మారింది. ఈ మట్టి రోడ్డు మీదుగా దుద్దేడ, రాంపల్లి,మర్పడగ, కొండపాక మండల కేంద్రానికి నిత్యం పలు గ్రామాలకు రోజూ వందల వాహనదారులు ప్రయాణము చేస్తుంటారు. పాడైన రోడ్లపై రాత్రి సమయాల్లో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు




