Thursday, 5 November 2026

వర్షాలతో హరితహారానికి ఊపు

ఇప్పటికే అనుకూలంగా మారిన వాతావరణం

కార్యక్రమానికి ముందే అక్కడా మొదలైన మొక్కల పెంపకం

హైదరాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ముసురు వల్ల హరితహారానికి మంచి ఊపు లభించినట్లయ్యింది. గతంలో నాటిన మొక్కులు ఏనుకునేలా ఇవి దోహదపడనున్నాయి. ప్రస్తుతం నాలుగో విడత హరితహారానికి శ్రీకారం చుట్టకున్నా అనేక ప్రాంతాల్లో అనధికారికంగా మొక్కల పెంపకం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వరుణ దేవుడు తోడు కావడంతో పలు జిల్లాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. పలు జిల్లాల్లో శని ఆదివారాలు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ యేడు కూడా పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటేలా రంగం సిద్దం చేశారు. సింగరేణి ప్రాంతంలో పలుచోట్ల హరితహారాన్ని నిర్వహించనున్నారు. నాయకులు, అధికారులు పర్యటించి పలుచోట్ల హరితహారంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా బావితరాల మనుగడను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై మొక్కలు నాటాలన్నారు. ఆయన భూపాలపల్లి జిల్లాలోకార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి వ్యక్తి తన ఇంటి ఆవరణలో ఐదు మొక్కలు నాటి హరితోద్యమానికి చేయూతనివ్వాలన్నారు. మొక్కలు విరివిగా నాటడం వలన అడువుల శాతం పెరిగి వాతావరణ సముతల్యత ఏర్పాడుతుందని, తద్వారా వర్షాలు సమృద్ధిగా సకాలంలో కురుస్తాయన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడే మొక్కలు విరివిగా నాటాలని అన్నారు. హరితహారం కార్యక్రమం వలన అడవుల విస్తీర్ణం పెరుగుతుందని, తద్వారా ప్రజలు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అక్కడక్కడా జల్లులు పడడంతో ఉత్సాహంగా మొక్కలు నాటారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాల్లో కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో విద్యార్థులు,

ఉపాధ్యాయులు పాల్గొనాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి ఇప్పటికే ఆదేశించారు.