హైదరాబాద్ : ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తున్న వామపక్షనేతలను తెలుగుదేశం పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోత్కుపల్లి నర్సింహులు డబ్బుకోసం వైఎస్ రాష్ట్రాన్ని నాశనంచేశారన్నారు. నమినెన్లకోసం విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని, అక్రమ సొమ్ముతో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో జగన్ కు విద్యుత్ ప్రాజెక్టులు వచ్చేలా చేశారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, వైకాపాలే సీబీఐ విచారణలో తేలిందని మోత్కుపల్లి ఆరోపించారు.




