హైరదాబాద్ : వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తెదేపా సభ్యులు వారి స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. సభ సజావుగా నడిపేందుకు సహకరించాలని సభాపతి కోరినా విపక్షాలు శాంతించలేదు. దీంతో స్పీకర్ సభను అరగంట వాయిదా వేశారు.




