వారం రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేయాలి
* పనుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా అదన కలెక్టర్ ప్రతిమ సింగ్ తూప్రాన్( జనం సాక్షి )జూన్ 29:: మున్సిపల్ కేంద్రమైన తూప్రాన్ శివారులో నిర్మితమవుతున్న డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు మరియు ఇతర పనులు వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ డి ఈ రాములు మరియు కాంట్రాక్టర్ ను ఆమె ఆదేశించారు ఆమె తూప్రాన్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా అధికారులపై కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు వందమందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని కాంట్రాక్టర్ ఆమెకు చెప్పగా ఒకరు కనిపించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపటినుండి సరిత గతిన పనులు చేయాలని ఆదేశించారు ఈరోజు ఏ ఏ పనులు చేస్తున్న విషయం తనకు వెంటనే తెలిపాలని తీయని ఆదేశించారు కరెంటు వైరింగ్ గ్రిల్స్ నిర్మాణము కిటికీలకు గ్లాస్ అమర్చడము కలర్ ఇతర పనులను యుద్ధ ప్రాతిపదికన చేయాలని ఆదేశించారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కు వెళ్లడానికి రోడ్డు అద్వాన్నంగా ఉందని గుంతలు గుంతలలో నీరు నిలిచాయని వెంటనే రోడ్డు పనులు చేయాలని ఆమె ఆదేశించారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు పూర్తి కాగానే అక్కడ నివసించడానికి అనుకూల వాతావరణం కల్పించాలని ఇంటర్నల్ రోడ్లు వేయాలని చిన్నచిన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు

Attachments area