వాహనదారుడిపై చేయిచేసుకున్న హీరో రామ్‌చరణ్
హైదరాబాద్, జనంసాక్షి: కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు ,హీరో రామ్‌చరణ్ ఓవరాక్షన్ చేశాడు. తన కారును ఢీకొట్టాడనే కారణంతో హీరో చరణ్ ఓ వాహనదారుడిపై చేయిచేసుకున్నాడు. తాజ్ డెక్కన్ హోటల్ వద్ద తన ఆస్టన్ మార్టిన్ కారును ఢీకొట్టడంతో చరణ్ రెచ్చిపోయాడు. తన కారును ఢీకొట్టిన మారుతి 800 వాహనదారుడిని చితకొట్టాడు. చరణ్ సెక్యూరిటీ గార్డు కూడా అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో వాహనదారుడికి గాయాలయ్యాయి. అతడి చొక్కా కూడా చిరిగిపోయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.