విఆర్ఏల తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధం.

నెన్నెల మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంను దిగ్బంధించిన విఆర్ఏలు.
నెన్నెల, అక్టోబర్10, (జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో కార్యాలయాన్ని దిగ్బంధం చేసి అధికారులు కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. దీనితో కార్యాలయం పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 78 రోజులుగా విఆర్ఏలు సమ్మెబాట పట్టినప్పటినుంచి రెవెన్యూ పనులు మందకొడిగా సాగుతున్నాయని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈకార్యక్రమంలో విఆర్ఏ జేఏసీ నాయకుడు దుర్గం శ్రీనివాస్, నాయకులు సునార్కరి స్వామి, పెరుగు మొండి, ఎల్లెల పొశం, అక్బర్, బోర్లకుంట రవి, సురేష్, శారద, రజిత విఆర్ఏలు పాల్గొన్నారు.