Tuesday, 3 November 2026

విఆర్ఏల సమ్మెకు మద్దతు తెలిపిన ఎంపీ సోయం బాపురావు.

నెరడిగొండ ఆగస్టు1(జనంసాక్షి) గ్రామ రెవెన్యూ సహాయకుల డిమాండ్లను కేసీఆర్ నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి విఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తోందని ఎంపీ సోయం బాపురావు అన్నారు.విఆర్ఎల సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమాలు చేస్తున్న విఆర్ఎల వద్దకు సోమవారం రోజున ఎంపి సోయం బాపురావు,రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు సాకటి దశరథ్ బోథ్ నియోజకవర్గ బిజెపి నాయకులు కలిసి వెళ్లి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సిఎం కెసిఆర్ ఇచ్చిన  హామీలను అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైంది కాదని అన్నారు.వీఆర్ఏల సమస్యలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఆ పే స్కెల్,55సంవత్సరాలు పూర్తయిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు,ప్రమోషన్స్ న్యాయమైన డిమాండ్లను మాత్రమే అడుగుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపి సోయం బాపురావు, రాష్ట్ర గిరిజన మోర్చా సాకటి దశరథ్ తోపాటు బీజేపీ  నాయకులు మాధవ్ రావ్ అమ్టే జివి రమణ రాజు యదవ్  మండల నాయకులు రాములు రాజశేఖర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.