నెన్నెల, మార్చ్ 16, (జనంసాక్షి )
నెన్నెల మండల విఓఏలు గురువారం ఐకేపీ ఏపీఎం విజయలక్ష్మికి సమ్మె నోటీసు అందజేశారు. తమ డిమాండ్ల సాధన కోసం రేపు, ఎల్లుండి సమ్మె చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. విఓఏలకు కనీస వేతనం 26 వేలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్సు, ప్రమాద భీమా, సెర్ప్ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, జీవో 58 సవరించాలనే డిమాడ్లతో సమ్మె చేస్తున్నట్లు విఓఏల సంఘం మండల అధ్యక్షుడు తైదల సమ్మయ్య తెలిపాడు. ఈకార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు దుర్గం మల్లేష్, ఉపాధ్యక్షుడు కౌటారపు భీమన్న, నాయకులు లేతకారి గణేష్, చుంచుల మల్లేశ్వరి, పురుషోత్తం, అనిల్, భాగ్య, నవ్య పాల్గొన్నారు.
విఓఏల సమ్మె నోటీసు.




