హైదరాబాద్,జూలై28(జనం సాక్షి): వికలాంగుల సహకార సంస్థ తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖ అధ్యర్యంలో శనివారం వికలాంగులకు ఉపకరణాలు అందచేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల విూదుగా వికలాంగులకు లాప్‌టాప్‌లు, బ్యాటరీ బైకులు, ఇతర ఉపకరణాలను అందజేశారు. హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి, నల్గండ జిల్లాల్లోని అర్హులకు శనివార అందజేశారు. మిగిలిన జిల్లా కేంద్రాల్లో కూడా త్వరలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.




