Tuesday, 3 November 2026

సిఐటియూ ఆధ్వర్యంలో రాస్తారోకో

శ్రీకాకుళం,జూలై28(జ‌నం సాక్షి): ఇఎస్‌ఐ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం చిలక పాలెంలో జాతీయ రహదారిని సిఐటియు నాయకులు దిగ్బంధం చేశారు. రహదారిపైబైఠాయించి తమ నిరసన తెలుపుతుండగా.. పోలీసులు సిఐటియు నాయకులను బలవంతంగా అరెస్టు చేశారు. కార్మిక సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు.