*వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ పై అన్ని పార్టీల వైఖరి స్పష్టం చేయాలి
మునగాల, అక్టోబర్ 15(జనంసాక్షి): వికలాంగు రాజకీయ రిజర్వేషన్ పై అన్ని పార్టీల వైఖరి స్పష్టం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. శనివారం మునగాల మండల పరిధిలోని కృష్ణానగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వికలాంగుల సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్యబాబు, సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు జూకంటి సైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు పేర్ల సోమయ్య యాదవ్, రాష్ట్ర సీనీయర్ నాయకులు లింగం రామలక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి పిల్లుట్ల ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మనబోయిన వీరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ReplyForward
|