తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మోర్ వెంకట్ గారి పిలుపు మేరకు , ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో NTR చౌరస్తా వద్ద వికారాబా NSUI బృందం రాస్త రోకో కార్యక్రమం చెయ్యడం జరిగింది. నిన్న నార్సింగి లో సాత్విక్ అనే ఒక విద్యార్థి, ఉపాధ్యాయుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మాహత్యా చేస్కొడం జరిగింది, దీనిని ఖండిస్తూ NSUI నాయకులు నిరసన తెలిపారు, సాంస్థల పేరు ప్రఖ్యాతల కోసం, విద్యార్థుల మీద ఒత్తిడిని వెయ్యడం మానేసి వారికీ సానుకూలంగా చదువులు చెప్పాలని డిమాండ్ చేసారు, అలాగే విద్యార్థులు కూడా మానసిక ఒత్తిడికిలోనై ఎటువంటి తప్పుడు నిర్ణయాలకు పాల్పడకూడదని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి , ఉపఅధ్యక్షులు సైఫ్ ఖాన్ , నియోజకవర్గ అధ్యక్షులు అనూప్ రెడ్డి ,సాయి రెడ్డి , ప్రశాంత్ రెడ్డి , అనంత్ రెడ్డి మరి కొందరు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొనడం జరిగింది
వికారాబాద్ జిల్లా కేంద్రంలో NTR చౌరస్తా వద్ద వికారాబా NSUI బృందం రాస్త రోకో




