Wednesday, 4 November 2026

 విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు 

కాంగ్రెస్ యువనేత పైలేట్ రోహిత్  రెడ్డి
తాండూరు సెప్టెంబర్ 16(జసంసాక్షి)
 విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలని కాంగ్రెస్ యువనేత  పైలట్ రోహిత్ రెడ్డి  వినాయకులకుప్రత్యేక పూజలు చేశారు ఆదివారం తాండూరు పట్టణంలోని 31 వార్డులో ప్రతిష్టించిన  వినాయకుల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువనేత పైలట్ రోహిత్ రెడ్డి  మాట్లాడుతూ పట్టణ ప్రజలను చల్లంగా దీవించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరారు .ఈ పూజా కార్యక్రమంలో తాండూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు

ప్రభాకర్ గౌడ్, నాయకులు విజయ్, అనిల్ తదితరులు ఉన్నారు.