విజయమ్మ దీక్షపై వీరశివారెడ్డి అభ్యంతరం

హైదరాబాద్‌ : విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెలేల నివాస ప్రాంగణంలో దీక్షకు ఎలా అనుమతించారని అ సెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు.