*విజ్ డమ్ హైస్కూల్లో తడి చెత్త ,పొడి చెత్త గురించి, విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 22,
జనంసాక్షి
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా అన్ని వార్డులో తిరిగే చెత్త సేకరణ ఆటో లో వేయాలని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఆదేశాల ప్రకారము
శనివారం రోజున పురపాలక సంఘం ఆధ్వర్యంలో పలు వార్డు ప్రజలకు , విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం కార్యక్రమం నిర్వహించటం జరిగినది,దీనిలో భాగంగా ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ రానావేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య పాల్గొని ప్రజలకు, విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థినులకు ప్రజలకు పొడి చెత్త ఏటు వంటి వస్తువులు తడి చెత్త ఎటువంటి వస్తువులు వివరించే కరపత్రాలను పంపిణీ చేశారు,మున్సిపల్ చైర్మన్ రానావేణి సుజాత సత్య నారాయణ మాట్లాడుతూ చెత్త సేకరణ ఆటోలో మహిళలు తప్పకుండా ఆకుపచ్చ చెత్త డబ్బాలో తడి చెత్త నీలం రంగు డబ్బాలో పొడి చెత్త వేసి మున్సిపల్ కార్మిక సిబ్బందికి సహకారం అందించాలని అన్నారు, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య మాట్లాడుతూ వార్డులో ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి మున్సిపల్ కార్మికులకు అందించి వారికి సహాకరించాలని, దీని ద్వారా ప్రజలకు అనారోగ్యాలు బారిన పడకుండా ఉంటారని అదే విధంగా ఇప్పటి వాతావరణ పరిస్థితులు డెంగ్యూ, విష జ్వరాలు ప్రభలుతున్న నేపథ్యంలో మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల ప్రజలు మరియు హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల కు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా విద్యార్థులు మీ కుటుంబ సభ్యులతో ఈ తడి చెత్త పొడి చెత్త గురించి అవగాహన కల్పించే బాధ్యత మీలో ఉందని మీరు తప్పకుండా ఎవరి ఇంటిలో వారి కుటుంబ సభ్యులకు తప్పకుండా తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేయాలని చెప్పి పరిశుభ్రమైన మెట్ పల్లి మున్సిపల్ గా ఆరోగ్యవంతమైన మెట్ పల్లి ప్రాంతంగా ఉత్తమ మున్సిపాలిటీగా పేరు తేవడానికి మీ సహకారం కావాలని అలాగే పట్టణ వాసుల సహకారం కావాలని వారి సహకారంతో మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు,
ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రానావేణి సుజాత సత్య నారాయణ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర రావు గారు ,మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య , మున్సిపల్ సానిటేషన్ ఇంచార్జి అక్షయ్ కుమార్, ముజీబ్ ఆర్పీలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు