Wednesday, 4 November 2026

విడిపోయి కలిసుందాం: ఎంపీ రాజయ్య

హైదరాబాద్‌: మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత నేతలు సమావేశం ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో తెలంగాణ రోడ్‌ మ్యాప్‌పై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్‌ ఎంపీ రాజయ్య మాట్లాడుతూ…. రాయల తెలంగాణ ప్రతిపాదన అధిష్ఠానం దృష్టిలో లేదన్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. విడిపోయి కలిసుందాం నినాదంతో ముందుకు వెళ్తామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *