Tuesday, 3 November 2026

విత్తన నిల్వలపై టస్క్‌ఫోర్స్‌ దాడి

హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి ): మేడ్చల్‌ జిల్లాలో పలు సీడ్స్‌ కంపెనీలపై వ్యవసాయశాఖ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పర్యవరణ అనుమతులు కల్తీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో 4 కంపెనీలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. సత్య సీడ్స్‌ అనే కంపెనీలో విత్తనాల నిల్వకు సంబంధించి సరైన రికార్డులు లేవని గుర్తించారు. దీంతో నిల్వ ఉంచిన విత్తనాలను సీజ్‌ చేశారు. మరో రెండు రోజులు పాటు తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
—-