Tuesday, 3 November 2026

ముందుకు కదలని మహిళా యూనివర్సిటీ ప్రతిపాదన

నేరుగా స్పందించని సిఎం కెసిఆర్‌ 
ప్రతిపాదనలు చేసిన కడియం శ్రీహరి
హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి ):  హైదరాబాద్‌ కోఠిలోని ఉమెన్స్‌ కాలేజీని మహిళా యూనివర్సిటీగా గుర్తించాలన్న ప్రతిపాదనలకు కార్యరూపం రాబోతున్నది.  దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్లు సమచారం. ఇప్పటికే ఈ విషయమై డిప్యూటి సిఎం కడియం శ్రీహరి ప్రతిపాదనలు సిద్దం చేసి  సిఎం కెసిఆర్‌తో చర్చించారు. కెసిఆర్‌ కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగేయూనివర్సిటీకి పేరు పెట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2018-19 విద్యా సంవత్సరం నుంచే ఈ యూనివర్సిటీలో విద్యార్థులను చేర్చుకోవడం, యూనివర్సిటీని ప్రకటించడం తదితర అంశాలపై సెం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కోఠి ఉమెన్స్‌ కాలేజీని మహిళా యూనివర్సిటీగా ప్రకటించాలన్న ప్రతిపాదనపై మాత్రం సర్వత్రా  హర్షం వ్యక్తం అవుతోంది. విభజన తరవాత తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆంద్రాకు వెళ్లింది. దదీంతో  తెలంగాణ మహిళా
విశ్వవిద్యాలయంగా కోఠి ఉమెన్స్‌ కాలేజీని మార్చాలన్న ప్రతిపాదన కెసిఆర్‌ చేశారు. సిఎం కేసిఆర్‌ ఆమోదంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని గతంలోనే కడియం శ్రీహరి కూడా ప్రకటించారు. కోఠి ఉమెన్స్‌ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని వసతులున్నాయని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం తీసుకుని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోఠి ఉమెన్స్‌ కాలేజీని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్చుతామని చెప్పారు. గత ఫిబ్రవరిలో ఆయన ఉన్నతాధి కారులతో కలసి కోఠి ఉమెన్స్‌ కాలేజీలో  ఆకస్మిక తనిఖీలు చేశారు. కాలేజీలో ఉన్న వసతులు పరిశీలించారు. బోధనా తీరుపై, విద్యావిధానంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉమెన్స్‌ కాలేజీ పరిసరాలను, భవనాలను తిరిగి చూశారు. హైదరాబాద్‌ నడిబొడ్డున 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కాలేజీలో బోధనావసతులు బాగున్నాయని, కాలేజీ వాతావరణం విద్యార్థులకు అనుగుణంగా ఉందని గుర్తించారు. ఈ కాలేజీలో రాష్ట్రంలోని 31 జిల్లాల విద్యార్థులున్నారని, వీరితో పాటు విదేశాలకు చెందిన చాలా మంది విద్యార్థినిలు కూడా చదువుతున్నారని చెప్పారు. తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం లేకుండా పోయిందన్న  విషయాన్ని ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, కేంద్రం ఇందుకు తగిన సాయం చేయాలని కడియం కోరారు.  ప్రస్తుతం కోఠి ఉమెన్స్‌ కాలేజీని చూసిన తర్వాత తెలంగాణకు మహిళా విశ్వవిద్యాలయం చేయడానికి కావల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని గుర్తించారు. దీనిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశ్వవిద్యాలయంగా మార్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. ఇందుకోసం నెల రోజుల్లో ఇక్కడ మహిళా విశ్వవిద్యాలయం ప్రారంభించడానికి కావల్సిన మౌలిక వసతులు, సదుపాయాలపై నివేదిక ఇవ్వమని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.ప్రస్తుతం కోఠి ఉమెన్స్‌ కాలేజీలో 42 యు.జి కోర్సులు, పీజీ కోర్సులు నడుస్తున్నాయని  ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఒక్క పరిశోధన మాత్రమే లేదని, విశ్వవిద్యాలయంగా మారితే పరిశోధన కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీగా ఉన్న కోఠి ఉమెన్స్‌ కాలేజీకి 37 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. దీంతో ఆయా భవనాల మరమ్మత్తులు కొనసాగుతున్నాయన్నారు. అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత కావల్సిన ఇతర వసతులు కూడా కల్పిస్తామన్నారు. ఇది సాకారమైతే మహిళా విశ్వవిద్యాయలం కల సాకారం కానుంది.
———-