Thursday, 5 November 2026

విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం కార్యక్రమం

ఖైరతాబాద్ : జూలై  (జనం సాక్షి)  ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ(ఎఫయూ) భాగస్వామ్యంతో స్టడీ గ్రూప్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించనుంది . ఈ కార్యక్రమం విదేశాల్లో చదువుకోవడానికి సంబంధించిన వివిధ ముఖ్యమైన అంశాల గురించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంపై దృష్టి పెడుతుందని స్టడీ గ్రూప్ ఇండియా రీజనల్ డైరెక్టర్ కరణ్ లలిత్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎఫీయూ స్థాయి ఉన్న విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడం మాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి విద్యని పొందడంలో ఉన్న వివిధ సంక్లిష్టతల గురించి భారతీయ విద్యార్థులు మరింత మెరుగ్గా తెలుసుకునేందుకు ప్రయత్నాలను దిశానిర్దేశించామన్నారు. ఈవెంట్లో పాల్గొనే విద్యార్థులు ఎఫ్ఎయూలో వారి తోటివారు, బ్యాచ్ మేట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం లభిస్తుందన్నారు. దీనివల్ల వారు ఎలా పురోగతి సాధించాలో తెలుసుకుంటారన్నారు. జూలై 27 న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.