విద్యాభివృద్ధికి చేయూతనివ్వాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):
సమాజంలోని ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి చేయూతనివ్వాలని హెడ్ కానిస్టేబుల్ రమేష్ పిలుపునిచ్చారు.బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 40మంది పేద విద్యార్థులకు రూ.50వేలు విలువ చేసే విద్యా సామాగ్రిని ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోడ్పాటు అందించాలని కోరారు. పేద విద్యార్థులకు, నిరుపేదలకు తన వంతుగా సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.అనంతరం ఆ స్కూల్ హెచ్ఏం పద్మ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేద విద్యార్థులకు సాయమందించడం అభినందనీయమని అన్నారు.కానిస్టేబుల్ రమేష్ ను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యాక్రమంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.