విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠ..

-సర్పంచ్ మొండెల్ల ఆంజనేయులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి):
విద్యాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సర్పంచ్ లు మొండెల్ల ఆంజనేయులు, పాతర్ల సుదర్శన్ లు అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని గుండ్లగుంటపల్లి, తిమ్మనపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న ఏకరూప దుస్తులను విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ లు మొండెల్ల ఆంజనేయులు, పాతర్ల సుదర్శన్ లు, ఉపాధ్యాయ బృందంతో కలిసి
అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మొండెల్ల ఆంజనేయులు,
ఉప సర్పంచ్ మంజుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు నరేందర్, గ్రామస్తులు యాదయ్య, రాములు, పుల్లయ్య, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.