విద్యార్థినీలకు డిక్షనరీలు పంపిణీ చేసిన ఎస్పీ

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 15 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల గద్వాల ప్రభుత్వ బాలికల పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న 250 మంది విద్యార్థిని లకు డిక్షనరీ, ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ మా సామజిక బాధ్యత టీమ్ సహకారంతో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ గురువారము పంపిణీ చేశారు. విద్యుత్ జిల్లా ఎస్ ఇ కె. భాస్కర్, విద్యుత్ డి. ఇ లక్ష్మణ్, సీనియర్ న్యాయవాది మధుసూధన్ బాబు,పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రాజనందం, సోషల్ రెస్పాన్సిబులిటీ టీం సభ్యులు యుగెంధర్ రెడ్డి, సంజీవ్, తిరుమలేష్, మురళి, పరమేష్,నాగేష్, వెంకట్ రాములు, చందు, రాజశేఖర్, కృష్ణ, రామన్న, దండోరా ఆంజనేయులు పాల్గొన్నారు.