Thursday, 5 November 2026

విద్యార్థి తల పగలగొట్టిన ఉపాధ్యాయురాలు

వరంగల్‌: ఓ విద్యార్థి తోటి విద్యార్థులతో కలిసి నవ్వాడని ఉపాధ్యాయురాలు అతని తల పగలగోట్టిన సంఘటన వరంగల్‌లో చుటచేసుకుంది. హన్మకొండ మండలం అరెపల్లి ఎన్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న తోటగిరి తేజ తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి నవ్వాడు. దీంతో ఆగ్రహించిన సైన్స్‌  ఉపాధ్యాయురాలు విద్యార్థి తలపై పరీక్ష ప్యాడుతో కొట్టింది. ఈఘటనలో విద్యార్థి తలకు తీవ్రగాయమైంది. వెంటనే యాజమన్యాం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా  ఎనిమిది కుట్లు పడ్డాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు పాఠశాలకు వద్ద అన్ని ఆందోళన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *