హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో మతతత్వ శక్తులపై పోరాటానికి విద్యార్థి సంఘాలు ఏకం కావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పిలుపునిచ్చారు. హెచ్‌సీయూలో ఆదివారం దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులను ఆర్‌ఎస్‌ఎస్-భాజపాలు నియమిస్తున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. చదువులకు బదులుగా ఓ విద్యార్థి సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు.




