విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ

జనం సాక్షి, వంగూర్:
మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం గ్రామ సర్పంచ్ చెన్నయ్య మరియు ఎస్ఎంసి చైర్మన్ బాలయ్య గారిచే ఉచిత దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ చెన్నయ్య  మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సకాలను అందుకొని క్రమశిక్షణతో బాగా చదువుతూ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మన గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులు కావాలని అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకోవాలని పాఠశాలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. మరియు ఎస్ఎంసి చైర్మన్ బాలయ్య మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మన గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం చంద్రశేఖర్, ఉపాధ్యాయులు సురేష్, నరసింహ,కాశీనాథం, రఘువీర్, పరశురాములు, పి ఈ టి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Attachments area