ఇటిక్యల,ఆగస్ట్29,( జనంసాక్షి): మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మంగళవారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చిన్నారులకు ఎమ్మార్ టీకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోఫియా యస్మీయ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపల ఉన్న చిన్నారులు తప్పనిసరిగా ఎమ్మార్ టీకాలను వేయించుకోవాలని వారు కోరారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ టీకాలు వేసుకోవడం వలన ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని వారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోఫియా యస్మియ, ఎ ఎన్ ఎమ్,నర్మద, ప్రధానోపాధ్యాయులు రేణుకాదేవి, ఉపాధ్యాయురాలు సౌమిత్రి, దీపిక రాణి,స్కూల్ చైర్మన్ బీచుపల్లి, ఎంపిటిసి గోపి, సత్యం తదితరులు పాల్గొన్నారు.




