విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సర్పంచ్ ఆకుల సాయిలు
బిచ్కుంద ఆగస్టు 10 (జనంసాక్షి) పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పెద్ద దడ్గి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆకుల సాయిలు, ఉపసర్పంచ్ సాయిలు అన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పాఠశాలను బుధవారం నాడు సందర్శించి భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని నాణ్యమైన ఆహారం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో చెట్లను పెంచాలి. పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సహాదేవ్ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.