13న మెగా లోక్ అదాలత్

వేములవాడ రూరల్, ఆగస్టు 10 (జనం సాక్షి) : వేములవాడ రూరల్ మండలం లోని కోర్టు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలని గ్రామీణ ఎస్సై నాగరాజు సూచించారు. ఈనెల 13 శనివారం రోజున నిర్వహించే మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. కక్షిదారులు రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్, వివాహ, కుటుంబ తగాదాలు, చిట్ ఫండ్స్, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ కేసులు ఇరు వర్గాలకు చెందిన వారు రాజీ కుదుర్చుకొని కేసులను పరిష్కరించుకోవాలన్నారు. గ్రామీణ మండలంను నేర రహిత మండలం గా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎస్సై నాగరాజు కోరారు