ఫోటో రైటప్: లింగాల పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రధానోపాధ్యా రాములు
పెన్ పహాడ్ ఆగస్టు 27 (జనం సాక్షి) :తల్లిదండ్రులు తమ పిల్లల చదువు పట్ల ఇంటివద్ద శ్రద్ధ వహించాలని ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రాములు అన్నారు మండల పరిధిలోని లింగాల ప్రాథమిక పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో శనివారం తల్లిదండ్రలకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రభుత్వం అన్ని పాఠ్యపుస్తకాలను ఇప్పటికె అందించడం జరిగిందని ఏకరూప దుస్తులను కూడా మరో వారం రోజుల్లో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు ఎస్ఎంసీ చైర్మన్ రణపంగ నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబోధన చేసేటప్పుడు ఉపాధ్యాయులు తప్పుల్లేకుండా బోధన చేయాలని వెనుకబడిన విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా విద్యను అందించాలని పాఠశాలలో మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు కానీ నూతనంగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు మరల ప్రైవేటు పాఠశాలలకు పంపించొద్దని తల్లిదండ్రులకు సూచించారు ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోందని అన్నారు పాఠశాల అభివృద్ధికి విద్యార్థులకు చదువును అందించడంలో ఉపాధ్యాయులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కోరారు తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అనేది ప్రతి రోజు తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ జూకూరి సరిత,ఉపాధ్యాయులు సుదర్శన్,కిరణ్మయి, శ్రీనివాసరెడ్డి, గోవింద్,విద్యార్థుల తల్లిదండ్రులు చలిగంటి స్వప్న, సంధ్య, స్వాతి,శ్రీనివాస్,వెంకటేశ్వర్ లు, సైదులు,తిరుపతయ్య,పద్మ,ఎంకమ్మ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు…




