-బహుజన జిల్లా అధ్యక్షుడు దానయ్య.
గద్వాల నడిగడ్డ మార్చి 14 (జనం సాక్షి);
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేదని నెపంతో విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకపోతే ఉద్యమాలు తప్పవని జోగులాంబ గద్వాల బహుజనసేన జిల్లా అధ్యక్షులు దానయ్య అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 నుండి జరుగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్షలను పకడ్బందీగా జరిపించాలని విద్యార్థులకు ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేసి బెంచీలను ఏర్పాటు చేయాలని సెంటర్ కి ఒక ఏఎన్ఎం కూడా ఏర్పాటు చేయాలని, మంచినీటి సదుపాయాన్ని సమకూర్చాలని,ఇరుకు గదులలో కాకుండా ప్రశాంతమైన గదులలో నిర్వహించాలని దానయ్య డిమాండ్ చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని అన్నారు. హాల్ టికెట్లు ఇవ్వకుండా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి విద్యాసంస్థలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ప్రతి విద్యార్థి పరీక్ష రాసే విధంగా చూడాలని వారు కోరారు. సుదూర ప్రాంత విద్యార్థులకు పరీక్షలు రాసే వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఉద్యమాలు తప్పవు




