Wednesday, 4 November 2026

విద్యార్థులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు..

 

–

 

 

 

 

 

 

ప్రత్యక్ష దాడులకు సైతం సిద్ధం..

ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు వేల్పుల ప్రసన్న కుమార్…

హన్మకొండ బ్యూరో చీఫ్ 10 జనంసాక్షి

జిల్లాలోని పలు విద్యాసంస్థలు పరీక్షల సమయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే ప్రత్యక్ష దాడులు చేస్తామని అఖిల భారత విద్యార్థి సమైక్య హన్మకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల ప్రసన్నకుమార్ హెచ్చరించారు..
శుక్రవారం రోజున హనుమకొండలోని బాలసముద్రం ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు
ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఇంటర్, పదవ తరగతి వార్షికోత్సవ పరీక్ష జరగబోతున్న నేపథ్యంలో హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఆ విద్య సంస్థ పై ప్రత్యక్ష దాడులకు వెనుకడుగు వెయ్యబోమని హెచ్చరించారు..
ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇప్పటివరకు స్కాలర్షిప్ అందలేదని,దీంతో ఫీజు చెల్లించి హాల్ టికెట్ తీసుకెళ్లండి అని షరతులు విధించే కళాశాల యజమానులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయించుకోవాలి తప్ప విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించబమన్నారు..
పరీక్షల సమయంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తులో ఆడుకోవద్దని,ఈ సమయంలో విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేస్తే అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా తాము సహించబోము అని ఆయన హెచ్చరించారు..