Thursday, 5 November 2026

విద్యార్థులు ట్రాఫిక్‌ రూల్స్‌ తెలుసుకోండి

రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌()()0 
హైద్రాబాద్‌((((((…,జ‌నం సాక్షి);విద్యార్థులు ట్రాఫిక్‌ రూల్స్‌ తప్పనిసరిగా తెలుసుకోవాలని రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అన్నారు. రాచకొండ కమిషనరేట్‌ లో మూడు రోజుల సమ్మర్‌ క్యాంప్‌ లో భాగంగా మొదటి రోజు ట్రాఫిక్‌ డిపార్ట్మెరట్‌ కి సంబంధించిన విషయాలపై  విద్యార్థులతో అవగాహన కార్యక్రమం ఎల్బీనగర్‌ గోటేటి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి  ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ (హైద్రాబాద్‌) అనిల్‌ కుమార్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రెడ్‌ లైట్‌ పడితే ఎం చేయాలి, ఎలాంటి జగ్రత తీసుకోవాలి అనే సందేహాన్ని అడిషనల్‌ సీపీ ట్రాఫిక్‌ అనిల్‌ కుమార్‌  పిల్లలకు వివరించారు. కార్‌ లో ప్రయానించేటప్పుడు డ్రైవర్‌ సహా అందులో కూర్చున్నవారు అందరూ సీట్‌ బెల్ట్‌ వేసుకోవాలని అన్నారు. అత్యవసరంగా టూ విల్లర్‌ పై బయట వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ వేసుకుని వెళ్లాలని సూచించారు. అనంతరం రాచకొండ సీపీ మాట్లాడుతూ.. మన దేశంలో సంవత్సరానికి దాదాపుగా లక్ష 50 వేల మంది రోడ్డు యాక్సిడెంట్‌ లో చనిపోతున్నారని సిపి తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ లో పట్టుబడితే కేస్‌ బుక్‌ అవుతుందని అన్నారు. ఓఆర్‌ఆర్‌ పై 100 /ఖప స్పీడ్‌ దాటితే చలాన్‌ ఇంటికి వస్తుందని, అలా 3 సార్లు కంటే ఎక్కువ సార్లు చలాన్లు వస్తే వాహనాలు సీజ్‌ చేస్తారని అన్నారు. వాహనాలు
నడుపుతూ సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్‌ చేయవద్దని అన్నారు. వాహన లైసెన్స్‌ ఎన్ని సంవత్సరాల లో తీసుకుంటారని రాచకొండ సీపీ అడిగిన ప్రశ్నలకు అందరూ విద్యార్థులు 18 సంవత్సరాలు అని ముక్త కంఠంతో సమాధానం తెలిపారు.   21 సంవత్సరాల  లోపు ఉన్నా వాళ్ళు డ్రైవింగ్‌ లైసెన్సు లెకుండా నడుపుతున్నారు. దాని ఫలితంగా యాక్సిడెంట్‌ ఎక్కువగా జరుగుతాయని అన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతా యుతంగా ఉండాలని మహేష్‌ భగవత్‌ సూచించారు. విద్యార్థులకు ట్రాఫిక్‌ పై సిగ్నల్స్‌ దగ్గర ఎలా నడుచుకోవలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమ్మర్‌ క్యాంపు ముడు రోజుల పాటు అవగాహన సదస్సు నిర్వహిస్తామని సిపి తెలిపారు. ఈ సదస్సు లో పాల్గోనె వారు 10 సం.. నుండి 18 సం.. ల వయసు కలిగిన వారు ఉండాలని, వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఉండకుండా ఈ సదస్సు లో చిన్నారులు అందరు పాల్గోనాలని ఆయన సూచించారు. ట్రాఫిక్‌, షిటిం, సైబర్‌ కైమ్ర్‌ అవగాహన సదస్సులు ముడు రోజుల పాటు నిర్వహింస్తుమని సిపి తెలిపారు. ఈ కార్యక్రమానికి కామినేని అంబులెన్స్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ ఆస. సుకుమార్‌ బృందం వైద్య సదుపాయం అందించారు.  కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్‌ రమేష్‌ నాయుడు, అడిషనల్‌ డీసీపీలు దివ్యచరన్‌, సలిమా, భరణి ఎస్సిఎస్సి సెక్రటరీ, కృష్ణ ఎదుల ట్రాఫిక్‌ ఫోరమ్‌ ఇంచార్జి, ఏసీపీ లు తదితరులు పాల్గొన్నారు.