విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
హన్మకొండ బ్యూరో చీఫ్ 28 నవంబర్ జనంసాక్షి
సోమవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో కలెక్టర్sc st బీసీ మైనారిటీ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు.శితా కాలం లో చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు నాణ్యమైన దుప్పట్లు జిల్లా అధికారుల సంఘం అందించడం జరిగింది అని, ఈ స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగాలని సూచించారు.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు.
జిల్లా అధికారుల మధ్య సమన్వయ సహకారంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి dro వసూచంద్ర, pd drda శ్రీనివాస్ కుమార్, జిల్లా ఉన్నత అధికారులు, పాల్గొన్నారు




