బిచ్కుంద మార్చి 29 (జనంసాక్షి) విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాలని మండల ఎంపీపీ అశోక్ పటేల్ మరియు నాల్చర్ రాజు అన్నారు. 10 తరగతి విద్యార్థుల వీడ్కోలు మహోత్సవంలో ఎంపీపీ అశోక్ పటేల్, నాల్చర్ రాజు పాల్గొని మాట్లాడారు. బుధవారం నాడు బిచ్కుంద మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల గణేష్ మందిర్ పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతూ 25 సంవత్సరాలు కష్టపడి చదివితే మిగిలిన 75 సంవత్సరాలు దర్జాగా బ్రతకొచ్చని అదేవిధంగా కష్టపడి చదివి మన బిచ్కుంద బాలికల ప్రాథమిక పాఠశాలకు మంచి మార్కులతో గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోహర్, ఉపాధ్యాయ బృందం, మండల భారాస అధ్యక్షుడు వెంకట్రావు దేశయ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాలి అశోక్ పటేల్ నాల్చర్ రాజు




