Wednesday, 4 November 2026

*విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి*

* పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేయాలని డిమాండ్
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఆగస్టు 6 :- కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మనబడి కార్యక్రమం కేవలం ప్రచారానికె పరిమితం అవుతుందని తెలంగాణ రాష్ట్ర బిజెపి నాయకులు సంతోష్ గుప్తా అన్నారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చేన్నాపురంలో గల ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో చిన్నపాటి వర్షానికె పెద్ద ఎత్తున నీరు నిలిచి ఉండడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్న మున్సిపల్ అధికారులు స్థానిక కార్పొరేటర్ ఈ సమస్యను పరిష్కరించేందుకు సుముఖత చూపుకపోవడంలో ఆంతర్యం ఏమిటనీ నిలదీశారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని డబ్బా కొట్టుకునే పాలకమండలి సభ్యులు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అని సభ సమావేశాల్లో ఫోటోలకు ఫోజులిస్తూ ప్రసంగాలు చేయడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో లేకపోవడం ఎంతో బాధాకరమని అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పటికైనా చెన్నాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు వర్షపు నీటితో ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు