ఎల్బీనగర్ (జనం సాక్షి ) తెరాస ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి ఆరోపించారు . మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం హెడ్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం స్థానిక శాసన సభ్యురాలు సభితా ఇంద్రా రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గా ఉండటం మహేశ్వరం నియోజకవర్గం ప్రజల దురదృష్టం అన్నారు. గత కొన్ని వారాల క్రితం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారి సమస్యల పరిష్కారానికి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వారు పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి, ప్రభుత్వం పై పెద్ద ఉద్యమం చేసి వారి డిమాండ్లను సాధించుకున్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా నిన్న కాక మొన్న బాసర ట్రిపుల్ ఐటీ కి వెళ్లిన మన విద్యాశాఖ మంత్రి గారు అక్కడి విద్యార్థులకు నేను మీకు ఒక అమ్మ లాగా, అక్క లాగా ఉంటానని కల్లిబోల్లి మాటలు చెప్పి విద్యార్థులను మభ్యపెట్టి మోసం చేశారన్నారు. వారు వెళ్లి సమస్యలను పరష్కస్తారని హామీ ఇచ్చిన వారం రోజులకే నేడు మళ్ళీ బాసర ట్రిపుల్ ఐటీ లో విష పూరిత ఆహార పదార్థాలను అందించి, ఆ ఆహారం తిన్న వేలాది మంది విద్యార్థులు నేడు అస్వసత కు గురై ఆసుపత్రి పలుచేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే చెల్లిందాన్నారు. సన్న బియ్యం వండి పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ బడుగు బలహీనర్గాలకు చదువు వస్తే రాజ్యాధికారం కావాలంటారు. అందుకే ఆయా వర్గాలకు చదువు అందకుండా. మొత్తం విద్యా వ్యవస్థనే కేసీఆర్ నాశనం చేశారు.
చదువు రాని వారికి విద్యా శాఖ అప్పగించి విద్య వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని మండి పడ్డారు. ముఖ్యమంత్రి తన పార్టీకి చెందిన నేతలకు యూనివర్సిటీలు ఇస్తున్నారు. బహుజన బిడ్డలు చదువుకునే ఓయూ, కేయు ఇతర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఫీజు రియంబర్స్ మెంట్ ని కావాలని పక్కన పెట్టారు. ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు, PRC ఇవ్వడం లేదు, పదోన్నతులు కల్పించడం లేదు, విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లిండం లేదన్నారు.
విద్యా విధానాన్ని నాశనం చేస్తున్న కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ తో కలిసి రావాలన్నారు. విద్యాశాఖ లో జరుగుతున్న లోపలకు, విద్యార్థులకు జరిగిన అసౌకర్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *కాకి ఈశ్వర్ ముదిరాజ్*, మహేశ్వరం గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *అల్లే కుమార్*, యువజన కాంగ్రెస్ నాయకులు *నల్లెంకి ధనరాజ్ గౌడ్, చెపంగి ప్రవీణ్, ఏవూరి నరసింహా, దశరథ నాయక్, సంగా రెడ్డి* తదితరులు పాల్గొన్నారు.




