విద్యాసంస్థల చైర్మెన్ రేపక ప్రదీప్ రెడ్డి జన్మదిన సందర్భంగా

 వలిగొండ జనం సాక్షి న్యూస్ అక్టోబర్ 9. మండల పరిధిలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన ఇందూర్ విద్యాసంస్థల చైర్మెన్ రేపక ప్రదీప్ రెడ్డి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన నివాస గృహంలో ఆదివారము గ్రామంలోని  టిఆర్ఎస్ కార్యకర్తలు బయలుదేరి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరము సీట్లు పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గొర్రె కాపరుల సంఘం డైరెక్టర్ దేశబొయిన సూర్యనారాయణ మాదా శంకర్ గౌడ్ దేశబొయిన నరసింహ రేపాక శ్రీనివాస్ రెడ్డి కందుల మహేష్ కదిరేని సురేష్ ముఖ్య కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.