విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి – జేఏసీ చైర్మన్ రామగల్ల పరమేశ్వర్
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 30 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై సెప్టెంబర్ 2న జరిగే విద్యాసంస్థల బంద్ కు అందరూ సహకరించాలని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ కోరారు. బుధవారం చేర్యాల మండలంలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల హెచ్ఎం, ప్రిన్సిపాల్ లకు విజ్ఞాపన పత్రాన్ని జేఏసీ నేతలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ధర్నాలు, ఆందోళనల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇంత ఉద్యమం జరుగుతున్న స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గ నాయకులు అందె అశోక్, మంచాల చిరంజీవులు, బిజ్జ రాము, చంద శ్రీకాంత్, బుట్టి సత్యనారాయణ, బుట్టి భిక్షపతి, పుట్టరాజు, ఆముదాల రంజిత్ రెడ్డి, కత్తుల భాస్కర్ రెడ్డి, ఏగుర్ల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.