Tuesday, 3 November 2026

విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట.

 

 

 

 

 

 

– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.ఫొటో : పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, ఫిబ్రవరి 1, (జనంసాక్షి )తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని 5వ వార్డులో మన ఊరు – మన బడి, మన బస్తీ – మనబడి పథకం కింద రూ. 32 లక్షల 11 వేల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలను ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తుందని, బంగారు తెలంగాణ దిశగా శర వేగంగా పరుగులు పెడుతుందన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, స్థానిక కౌన్సిలర్ విజయ తిరుమల, కౌన్సిలర్ గోసిక రమేష్, ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి, నాయకులు గడ్డం భీమా గౌడ్, శ్రీధర్, సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.