Tuesday, 3 November 2026

విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని సీఎంకు లేఖ సమర్పించిన బీజేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని రైతులకు ఏడు గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి లేఖ సమర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీబియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు ఉందని ఎంత ఖర్చయినా కరెంట్‌ను కొనుగోలు చేసి విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని లేకపోతే పరిశ్రమలు మరి కొద్ది రోజుల్లో మూసివేసుకునే పరిస్థితి ఉందని, రైతులకు కనీసం ఏడు గంటలైన సక్రమంగా సపఫరా చేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి   ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *