Tuesday, 3 November 2026

విద్యుత్ కోతులకు నిరసనగా రాస్తారోకో..

 

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ ఫిబ్రవరి 06 జనం సాక్షికరెంటు కోతలకు నిరసనగా ముధోల్ తాలూకా నాయకులు రామారావు పటేల్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నానిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. బిజెపి నాయకులతో,తాలూకా వ్యాప్త రైతులు బై0సా విద్యుత్ సబ్స్టేషన్ ముందర ధర్నా నిర్వహించి,జాతీయ రహదారి పై రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా రామారావు పటేల్, నాయకులు పలువులు రైతులు మాట్లాడారు. 24 గంటల విద్యుత్ అందిస్తానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు పంటలు పండడానికి కనీస అవసరమైన నీటి సౌకర్యాన్ని కూడా అందించకపోవడం రైతులకు చాలా బాధాకరమని, విధిస్తున్న కరెంటు కోతలతో పంటలు నేలపాలు అవుతున్నాయని అన్నారు.రానున్న రోజుల్లో బిజెపి సర్కారు రైతుల పక్షాన నిలిచి అన్ని విధాల మేలు చేస్తుందని అన్నారు.విద్యుత్ అధికారులు రావాలంటూ బైఠాయించారు.సంబంధిత అధికారులు రావడంతో వినతిపత్రం అందించి,కరెంటు కోతలు ఉండకుండా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎక్స్ బై0సా మున్సిపల్ వైస్ చైర్మన్ గంగాధర్,నగర్ నారాయణ్ రెడ్డి, తూమోల్ల దత్తాత్రి( తూమోల్ల ముత్తన్న సేవాసమితి అధ్యక్షులు), తాలుకాకి భాజపా చెందిన నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.