విద్యుత్ పునరుద్ధరణ పనులు త్వరగా చేపట్టాలి – విద్యుత్ శాఖ ఎస్ఈ కి వినతి పత్రం సమర్పించిన ఎంపీపీ
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పది రోజుల నుండి భారీ వర్షాలు కురవడం వలన అనేక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ తీగలు తెగిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పడిపోవడం వల్ల విద్యుత్ అంతరాయం కలిగినందున, విద్యుత్ పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని కోరుతూ మంథనికి రివ్యూ సమావేశానికి వచ్చిన ట్రాన్స్కో ఎస్.ఇ కి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఆదేశానుసారం మంథని ఎంపీపీ కొండ శంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కటి అనంతరెడ్డి, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పెగడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.