జనంసాక్షి ఆగస్టు 23 రాజంపేట్
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ముత్యాల నారాయణ(36) తన వ్యవసాయ బోరు వద్ద విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై జి రాజు తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన ముత్యాల నారాయణ మంగళవారం ఉదయం తన సొంత వ్యవసాయ పంట చేనులోకి పొలం గేట్లు కోయడానికి ఇంట్లో చెప్పి వెళ్లారు బోరు స్టార్ట్ చేసే క్రమంలో స్టార్టర్ డబ్బా కు తేలిన వైరు షాక్ తగిలి అక్కడికక్కడ పడి మృతి చెందారని తెలిపారు మధ్యాహ్నం 12 గంటల వరకు నారాయణ ఇంటికి రాకపోవడం ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో కుమారుడు రాజశేఖర్ అక్కడికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు ఈ విషయాన్ని తల్లికి సమాచారం చేరవేయగా కుటుంబీకులు వచ్చి తమకు సమాచారం ఇచ్చారని భార్య సావిత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు