విద్యుత్ సవరణ బిల్లు ను వెంటనే ఉపసంహరణ చేయాలి.

తోర్రుర్ 8 ఆగష్టు (జనంసాక్షి) విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద
కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టనున్న  ముసాయిదా సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ డివిజన్ కేంద్రంలోని  విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద సోమవారం విద్యుత్ కార్మికుల సంఘం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన  తెలిపారు.ఈ సందర్భంగా విద్యుత్  కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి మోడం  వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లును ఆమోదించి అమలు చేయటం వలన ఉద్యోగులు వినియోగదారులకు రైతులకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్  ఉపయోగపడే వారికి తీవ్ర  నష్టాలకు గురి అవుతారని వెంటనే యొక్క విద్యుత్ ముసాయిదా బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు  లేనిచో జేఏసీ తరఫున ఉద్యమాలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో శ్రీనివాసరావు ,ఉమారాణి, తరుణ్ ,రవీంద్ర చారి ,కొలుకుల వీరసోములు, సుగంధ రాగం శ్రీకాంత్ బి వెంకట సోములు ఎన్. శ్రీనివాస్, బోజాలు, ఎండి యాకుబ్ తదితరులు పాల్గొన్నారు