విధుల్లోకి చేరిన వీఆర్ఏలు
ఆత్మకూర్ (ఎం) అక్టోబర్13 (జనంసాక్షి) ఆత్మకూరు వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 80 రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేసిన సంగతి తెలిసిందే బుధవారం రాత్రి ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు దీక్షను విరమింప చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండల వీఆర్ఏలు కూడా తమ విధులకు హాజరవుతున్నామని సమ్మె విరమణ పత్రాన్ని సమర్పించారు నేటి నుండి విధులకు హాజరవుతున్నట్లుగా తహసీల్దార్ కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు పాల్గొన్నారు