విధుల్లో చేరిన విఆర్ఏలు.
విధుల్లో చేరుతున్న విఆర్ఏలు.
బెల్లంపల్లి, అక్టోబర్13, (జనంసాక్షి)
రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్ల సాధన కోసం 79 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏలు గురువారం సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. విఆర్ఏ జేఏసీ నాయకులు బుధవారం రాత్రి సీఎస్ సోమేశ్ కుమార్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో విధుల్లో చేరినట్లు బెల్లంపల్లి విఆర్ఏ జేఏసీ నాయకుడు మహేందర్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ఉన్నందున నవంబర్ నెలలో జీవో విడుదల చేస్తామని సీఎస్ తెలపడంతో సమ్మె విరమించి విధుల్లో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. సమ్మెకు దిగిన విఆర్ఏలు అందరూ విధుల్లో చేరుతున్నట్లు తహసీల్దార్ కుమారస్వామికి విధుల్లో చేర్చుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.